Home  »  TV News  »  Illu illalu pillalu : పెళ్లి వెనుక అసలు నిజం తెలుసుకున్న భాగ్యం.. 

Updated : Jul 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -526 లో..... ప్రేమ ధీరజ్ తము పెళ్లి చేసుకున్న రూమ్ కి వెళ్లి ఒకసారి చూడాలని రిసెప్షనిస్ట్ ని రిక్వెస్ట్ చేసి గదిలోకి వెళ్తారు. ప్రేమని ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడో.. అది గుర్తుచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు బయటకి వచ్చి మనం ఆ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు మాత్రం హ్యాపీగా ఉన్నామని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ వెనకాలే భాగ్యం, ఆనందరావు హోటల్ కి వెళ్లి రిసెప్షనిస్ట్ కి డబ్బు ఇచ్చి ఆ రోజు ఏం జరిగిందో చెప్పమంటారు.

ఆ తర్వాత కళ్యాణ్ అనే అతనితో ప్రేమ వస్తుంది. వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడే మా హోటల్ పై రైడ్ జరుగుతుంది. ఆ కేసులో ప్రేమ అరెస్ట్ అవ్వకూడదని వాళ్ళ అమ్మ బలవంతం మీద ప్రేమ మెడలో ధీరజ్ చేత తాళి కట్టించిందని తను జరిగింది మొత్తం చెప్తుంది. సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఇంకా కొంచెం డబ్బు ఇస్తారు. రిసెప్షనిస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఇస్తుంది. మరొకవైపు నర్మద, వేదవతి ఇంటి దగ్గర టెన్షన్ పడుతారు. రామరాజు వచ్చి భోజనం పెట్టు అంటాడు. తను బయటే ఉండి మీరే పెట్టుకోండి అంటుంది. ఎందుకు అంత కంగారు అని రామారాజు అనగానే ఇంకా ప్రేమ,  ధీరజ్ రాలేదని వేదవతి అనగానే అత్తయ్య మీరే కంగారులో నిజం చెప్పేలా ఉన్నారని నర్మద అంటుంది. మరొకవైపు అమూల్యకి విశ్వ సైగ చేస్తాడు. అమూల్య కోప్పడుతుంది.

ఆ తర్వాత ధీరజ్ అంటే డ్రైవింగ్ కి మరి ప్రేమ ఎక్కడికి వెళ్ళిందని రామరాజు అనగానే షాపింగ్ కి అని వేదవతి చెప్తుంది. ఆ తర్వాత ప్రేమ, ధీరజ్ వస్తారు.  వేదవతికి జరిగింది మొత్తం చెప్తుంది. హమ్మయ్య కేసు అవుతుందని భయపడ్డా అని వేదవతి అనగానే రామరాజు వచ్చి ఏం కేసు అని అంటాడు. దాంతో అందరు కవర్ చేస్తారు. ప్రేమ, ధీరజ్ షాపింగ్ అన్నారు కదా అత్తయ్య కవర్స్ లేవేంటని వల్లి అనగానే మళ్ళీ ఏదో ఒకటి కవర్ చేస్తారు. ఆ తర్వాత భాగ్యం వాళ్ళు సాక్ష్యం సాధించామని వల్లికి ఫోన్ చేసి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.